పదవీ విరమణ వయసు సడలింపు ఆ ఉద్యోగులకి మాత్రమే !


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ పదవీ విరమణ వయసు పెంపు వర్తింపజేస్తూ ఆయా సంస్థలు ఉత్తర్వులు ఇవ్వడం తగదని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి SS రావత్‌ ఉత్తర్వులు ఇచ్చారు.