కన్నీళ్లు పెట్టుకున్న టెన్నిస్ సంచలనం రోజర్ ఫెదరర్


రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్టుకు వీడ్కోలు పలికాడు. లండన్‌ వేదికగా జరుగుతున్న లావర్ కప్ కోర్టులో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు.పురుషుల సింగిల్స్‌లో మకుటం లేని ఈ రాజు తన చివరి మ్యాచ్‌ను స్విస్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌తో కలిసి డబుల్స్‌ బరిలోకి దిగాడు. అయితే ఈ వీడ్కోలు మ్యాచ్‌లో ఫెడరర్‌- నాదల్‌ జోడి ఓటమిపాలైంది. ఆరంభంలో అదరగొట్టిన ఈ సూపర్‌ జోడీ ఫ్రాన్సెస్ టియాఫో- జాక్ సాక్ చేతిలో4-6, 7-6(2), 11-9 ఓటమిపాలైంది. కాగా ఫెదరర్ తన చివరి మ్యాచ్‌లో గెలుపొందాలని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ అదేమి జరగలేదు. కాగా ఈ మ్యాచ్‌ తర్వాత టెన్నిస్‌ కోర్టంతా కన్నీటి భావోద్వేగాలతో నిండిపోయింది. ఫెదరర్‌తో పాటు చివరి మ్యాచ్‌లో అతనితో కలసి కోర్టును పంచుకున్న నాదల్‌ వెక్కివెక్కి ఏడ్చారు.వారితో పాటు జకోవిచ్‌,ముర్రే వంటి స్టార్‌ ఆటగాళ్లతో పాటు టోర్నీ నిర్వాహకులు, ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.