ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 23,24 తేదీల్లో ఈ మహాసభలు విజయవాడలో నిర్వహించనున్నారు.మారుతున్న పరిస్థితుల్లో రచయితల పాత్ర- కర్తవ్యం,కార్యాచరణే లక్ష్యాలుగా ప్రపంచ 5వ తెలుగు రచయితల మహాసభలను విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి తెలుగు రచయితలు, సాహితీ అభిమానులు తరలిరావాలని మహాసభల గౌరవాధ్యక్షుడు, మాజీ సభాపతి మండలి బుద్ధప్రసాద్ కోరారు.కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం నిర్వహణలో ఈ మహాసభలు జరగనున్నాయి.