జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు. చిరంజీవి వల్లనే ఈ స్థాయికి వచ్చిన పవన్ ఆయన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని.. తాను చాలా పునీతుడినని అన్నట్లు పవన్ మాటలు ఉన్నాయని పేర్ని నాని ఎద్దేవా చేశారు.2009లో ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ మళ్లీ కనిపించలేదని,ఆనాడు పార్టీని పవన్ ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.
రాజకీయాల్లో పవన్ చేసినన్ని తప్పులు చిరంజీవి చేయలేదన్నారు.2009లో చంద్రబాబును తప్పుబట్టిన పవన్ 2014లో అదే వ్యక్తికి ఓటు వేయమని ప్రజల్ని కోరాడని పేర్ని నాని విమర్శించారు. హైదరాబాద్‌ను విడిచి కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చిరంజీవి నిఖార్సైన నాయకుడు అని, పవన్ వారాంతపు నాయకుడు అని చురకలు అంటించారు.పవన్ భ్రమల్లో బతుకుతున్నాడని ఆరోపించారు.ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి తాను గెలిచి తన పార్టీకి 18మంది MLAలను గెలిపించుకున్నారని,యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడని పేర్ని నాని సూటి ప్రశ్న వేశారు.