మహాగణపతి అందాలసొగసుల సౌందర్యమే పురాణపండ ” విఘ్నరాజంభజే

మంత్రి రోజా పక్షాన జబర్దస్త్ టీమ్ కి అందజేసిన రాకెట్ రాఘవ

తెలుగువారి చరిత్రలో ఘనవైభవం కలిగిన రాజమహేంద్రవరానికి చెందిన సనాతన వేద ధర్మ జీవన వంశానికి చెందిన ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ఈ సంవత్సరం అందించిన కవితా వైదుష్యాల , సాహిత్య ప్రభల , ప్రాచీన స్తోత్ర సంప్రదాయాల సిద్ధి వినాయక వ్రతకల్ప అక్షర గుచ్చం సర్వాంగ సుందరంగా లక్షల పాఠకుల్నీ , భక్తుల్నీ, మేధావుల్నీ, అర్చక, వేదపండితుల్నీ ఒక మాధుర్యంతో ఆకర్షణీయంగా కట్టేసింది.

సమయానికి ఔచితీమంతంగా , పరమాద్భుతాలను కురిపిస్తూ , ఎంతో ఆసక్తితో , విలువలతో అందాల సొగసులతో పురాణపండ శ్రీనివాస్ సాక్షాత్కరింప చేసిన ఈ గ్రంధానికి నమస్కరిస్తే సాక్షాత్తూ గణపతికి నమస్కరించినట్లేనని తెలంగాణా ప్రభుత్వ సలహా దారులు , సీనియర్ ఐఏఎస్ అధికారి కె. వి . రమణాచారి పురాణపండ శ్రీనివాస్ పై ప్రశంసలు వర్షించారు. రవీంద్రభారతిలో తెలంగాణా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగి కళాత్మక వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రమణాచారి ” విఘ్నరాజం భజే : అనే పేరుతో ఎంతెంతో అక్షర రమ్యతతో పురాణపండ శ్రీనివాస్ తీర్చిదిద్దిన తీయందనాల జ్ఞాన గణపతి వినాయక వ్రతసౌందర్యాన్ని ఆవిష్కరించారు.

తొలి ప్రతిని స్వీకరించిన ప్రముఖ సినీనటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, జయభేరి సంస్థ చైర్మన్ మురళీమోహన్ పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాల ప్రశస్తిని చూసి కొంత మంది గ్రంథ ప్రచురణల వ్యాపార వైఖరిని మార్చుకోవాలని, శ్రీనివాస్ నిస్వార్ధత సాధారణ అంశం కాదని , కేవలం దైవబలమేనన్నారు.

ఈ గ్రంధాన్ని తెలంగాణా లోని అనేక ప్రాంతాలకు వేలకొలది ప్రతులను ప్రముఖ నిర్మాతలు చలసాని అశ్వనీదత్ , సాయికొర్రపాటి , కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని క్రిష్నయ్య వంటి ప్రముఖులు అందించగా , ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక వినాయక ఆలయాలకు , వైఎస్సార్సీపీ నాయకులకు , కార్యకర్తలకు , జబర్దస్త్ టీం కి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖామంత్రి ఆర్కే రోజా కొన్ని వేల ప్రతులను సమర్పించడం విశేషం. కోట్లాది ఆడియన్స్ ని కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా ఆకట్టుకుంటున్న జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ నటులకు మంత్రి రోజా పక్షాన రాకెట్ రాఘవ పంచడం ఒక ప్రత్యేకం. ఈ సందర్భంగా రాకెట్ రాఘవ మాట్లాడుతూ రోజా మేడమ్ ఈ పవిత్ర సౌందర్య గ్రంధంతో గణపతి అనుగ్రహాన్ని మా టీం అందరిపై కురిపించారని , రోజాకి, పురాణపండ శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రంథ సౌందర్యం పట్ల , కంటెంట్ పట్ల రచయిత, నటుడు హైపర్ ఆది హర్షం వ్యక్తం చేయడం మరొక విశేషం. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలోప్రాచీనాంధ్ర సంస్కార వైభవంతో , సంస్కృతపదాల మాధుర్యంతో , పాల్కురికి సోమనాథుని పద్య సౌందర్యాలతో వేలాదిని ఆకట్టుకున్న సంస్కృతీమూర్తులైన పుణ్యదంపతులు , ప్రముఖ అర్చక శ్రేష్టి శ్రీ ఆదిత్య రాంపా దంపతులు ఈ మహోత్తమ గ్రంధాన్నిఐఏఎస్ అధికారి కె. వి . రమణాచారి ప్రోత్సాహంతో విశాఖపట్నం, శ్రీకాకుళం, టెక్కలి, విజయనగర బ్రాహ్మణోత్తములకు ప్రత్యేక శ్రద్ధతో పంచడమే కాకుండా … ఈ ‘ విఘ్నరాజం భజే ‘ గ్రంథ స్ఫూర్తిని తెలియజేయడం అందరినీ ఆకర్షిస్తోంది.. ఈ దంపతుల సంస్కార వైభవం ఫేస్బుక్ లో వీరికి ఎంతోమందిని అభిమానులుగా చేసింది.

ఏదేమైనా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక మహాగణపతి సాక్షత్కారంగా ఈ ఈ అద్భుతగ్రంధం చేసిన పుణ్య సంచలనానికి హేతువైన పురాణపండ శ్రీనివాస్ కి గణపతి భగవానుడు మరింత బలాన్నివ్వాలని మనం కోరుకోవడం మన బాధ్యత. ఈ మహోత్తమ గ్రంధాన్ని ప్రజలకు చేరువ చేయడం లో ప్రముఖ సినీ నటి రోజా, వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి చూపిన చొరవపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కాణిపాకం , తిరుపతి, కాకినాడ, విజయవాడ, నగరి, హైదరాబాద్ , విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాలలో ఈ గ్రంధం చేసిన సంచలనం అంతా, ఇంతాకాదు. ఇదంతా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మాత్రమేనని , వేంకటాచలక్షేత్రమే ఈ అక్షరశక్తికి కారణమని పురాణపండ శ్రీనివాస్ సాహిత్యవేత్తలతో స్పష్టం చెప్పడం ఆయన బలమైన నమ్మకానికి స్పష్టమైన నిదర్శనంగా మనమూ జేజేలు పలకాల్సిందే. ఇన్ని సంవత్సరాలుగా ఇంతటి ఘనకార్యాన్ని నిస్వార్ధంగా చెయ్యడం ఆషామాషీ వ్యవహారం కాదనేది ఎవ్వరైనా వొప్పుకొని తీరాల్సిందే. ఈ శ్రీకార్యాలు రెండు తెలుగు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ కి మాత్రమే సాధ్యమైన సత్యమని రాజకీయనేతలు సైతం నొక్కి చెప్పడం విశేషం. అయితే ఈగ్రంథావిష్కరణల్లో గానీ , ఈ విశేష వైభవాల్లో గానీ శ్రీనివాస్ కనిపించకపోవడం మాత్రం ఆశ్చర్యకరమే.