‘ది వారియర్’ దర్శకుడు లింగుస్వామి కటకటాల పాలయ్యాడు. తమిళ్ ఇండస్ట్రీ లో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లింగుస్వామి..చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. గతంలో హీరో కార్తీ, సమంత జంటగా ‘యెన్ని ఏలు నాల్’ మూవీ రూపొందించడానికి లింగుస్వామి తన హోమ్ ప్రొడక్షన్ తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ లోనే ప్లాన్ వేశాడు. అయితే లింగుసామి తన అవసరాల నిమిత్తం పీవీపీ ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 1.35 కోట్లు అప్పుగా తీసుకున్నాడట. ఇక ఆ తర్వాత రూ. 35 లక్షలు పీవీపీ ఫైనాన్స్ కి చెక్ రూపంలో ఇచ్చాడు..
అయితే లింగుస్వామి ఇచ్చిన రూ.35 లక్షల చెక్ బౌన్స్ అయ్యింది. ఇక ఫైనాన్స్ కంపెనీ.. లింగుసామిపై కోర్టులో కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన అనంతరం న్యాయస్థానం.. దర్శకుడు లింగుసామికి 6 నెలల జైలు శిక్షను విధించింది. అలాగే ఇవ్వాల్సిన డబ్బును వడ్డీతో పాటు చెల్లించాలని ఆదేశాలు కూడా అందాయి. ఇక సైదాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. లింగుసామి మద్రాస్ హైకోర్టుకు వెళ్లినట్లు సమాచారం. ఇక రీసెంట్ గా ఈయన హీరో రామ్ తో ది వారియర్ అనే మూవీ చేసాడు. కానీ ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.