తిరుమల : అక్టోబ‌రు నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీ


తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగ‌స్టు 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది. అలాగే అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 2 గంట‌ల‌కు లక్కీడిప్‌ ద్వారా కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇదే నెలకు సంబంధించి క‌ల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను 24న సాయంత్రం 4 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నట్లు పేర్కొంది.