త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ దేవరకొండ..ఈ చిత్ర ప్రమోషన్ లలో బిజీ గా ఉన్నారు. తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో అనన్య , విజయ్ దేవరకొండ లు సందడి చేసారు. ముందుగా మాస్కులు ధరించి స్టేషన్కు చేరుకున్న వీరిద్దరూ ఫ్లాట్ఫామ్పైనే చాలాసేపు కూర్చొన్నారు. అనంతరం రైలెక్కిన వీరిద్దర్నీ అందులో ఉన్న ప్రయాణికులు గుర్తించి.. సరదాగా ముచ్చటించారు. అభిమానులతో మాట్లాడిన తర్వాత అనన్య ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తూ విజయ్ సేదతీరారు.
ఇక గురువారం సాయంత్రం కూడా ఈ జోడీ ముంబయిలోని ఓ బస్తీకి వెళ్లి.. సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ కోసం విజయ్-అనన్య మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆగస్టు 25 న పాన్ ఇండియా మూవీ గా పలు భాషల్లో విడుదల కాబోతుంది.