కేంద్ర జలశక్తి మంత్రితో అంబటి రాంబాబు భేటీ !


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంతానికి నీరందించే వరికెపూడిశెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపిందర్‌ యాదవ్‌ను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు,ఎంపీ మిథున్‌రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఢిల్లీలో మంత్రిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే సంబంధిత డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో మంత్రి అంబటి భేటీ అయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్షనేత మిథున్‌రెడ్డితో కలిసి షెకావత్‌ను కలిశారు. మంత్రిగా తొలిసారి ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినట్లు అంబటి చెప్పారు.