నేషనల్ అవార్డు దక్కించుకున్న ‘కలర్ ఫోటో’ చిత్రం

సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించిన `కలర్ ఫొటో` చిత్రం నేషనల్ అవార్డు దక్కించుకుంది. సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2020 లో నేరుగా ఆహా ఓటిటిలో విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం నేషనల్ అవార్డు దక్కించుకుంది. శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఉత్తమ చిత్రంగా `కలర్ ఫొటో` నిలిచింది.

ఉత్తమ కొరియోగ్రఫీ మేకప్ విభాగాల్లో `నాట్యం` మూవీ ఎంపిక కాగా ఉత్తమ సంగీత ప్రధాన చిత్రంగా అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠ పురములో` సినిమాలు అవార్డుల్ని సొంతం చేసుకున్నాయి. అలాగే ఉత్తమ నటుడి అవార్డుకు ఇద్దరు హీరోలు ఎంపికయ్యారు. `సూరరైపోట్రు` (ఆ కాశమే ని హద్దురా) చిత్రంలోని నటనకు గానూ హీరో సూర్య ఎంపిక కాగా, హిందీ మూవీ `తానాజీ` చిత్రానికి గానూ అజయ్ దేవ్ గన్ ఎంపికయ్యారు. ఇక ఉత్తమ నటిగా `సూరరైపోట్రు` ఫేమ్ అపర్ణా బాలమురళి ఎంపికైంది.

ఇక పూర్తి అవార్డు విజేతల లిస్ట్ చూస్తే..

జాతీయ అవార్డులు విజేతలు వీరే:

ఉత్తమ నటుడు : సూర్య (సూరారైపోట్రు) అజయ్ దేవ్ గన్ (తానాజీ)

ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి (సూరారైపోట్రు)

ఉత్తమ చిత్రం : సూరారైపోట్రు

ఉత్తమ దర్శకుడు : దివంగత సచ్చిదానందన్ ( అయ్యప్పనుమ్ కోషియుమ్)

ఉత్తమ సహాయనటి : లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళం)

ఉత్తమ సహాయ నటుడు : బిజూ మేనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)