రేపు ‘రంగరంగ వైభవంగా’ టీజర్ వచ్చేస్తుంది..


ఉప్పెన, కొండపోలం చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్..ప్రస్తుతం ‘రంగరంగ వైభవంగా’ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గిరీశాయ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడం తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలోని పలు పాటలు విడుదలై సినిమా ఫై ఆసక్తి నింపాయి. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తుంది.

ఇక ఈ సినిమాకు సంబందించిన మొదటి టీజర్ ను ఈ నెల 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. AMB సినిమాస్ లో ప్రత్యేకంగా ఉదయం 11 గంటలకు యూట్యూబ్ ద్వారా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా అనంతరం వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తో చేయబోతున్నాడు.

త్రివిక్రమ్ అలాగే సీతారా ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించబోతున్న ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వైష్ణవ్ తేజ్ లిస్టులో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఒక ప్రముఖ దర్శకుడు కూడా ఇటీవల వైష్ణవ్ తేజ్ కోసం ప్రత్యేకంగా ఒక కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.