శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నో బాల్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఐపీఎల్ యాజమాన్యం పంత్‌తో పాటు అతనికి మద్దతుగా నిలిచిన శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలపై చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్ కోసం రిషబ్ పంత్‌కు లభించే మ్యాచ్ ఫీజు మొత్తంపై 100 శాతం కోత విధించగా, శార్దూల్ ఠాకూర్‌కు 50 శాతం జరిమానా పడింది. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గాను ప్రవీణ్ ఆమ్రేపై 100 శాతం జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించింది.