సీఎం.. సుపరిపాలన..!

cm-kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో “అమ్మహస్తం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం ఈ రోజు బి.కొత్తకోటలో అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడూతూ.. దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టింది తానేనని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ఈ ఏడాది మైనారిటీలకు 1027కోట్లు, బీసీలకు 4027కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని సీఎం అన్నారు. కాంగ్రెస్ పాలన సుపరిపాలనగా సీఎం అభివర్ణించారు.

రాష్ర్టంలో ఉద్యమాలతో సతమతమవుతున్న నేపథ్యంలో… ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించిందని కిరణ్ తెలిపారు. అయితే..ఇటు తెలంగాణ అటు సమైక్యాంధ్రా ఉద్యామాలు జరుగుతున్న సమయంలోనూ.. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూశామని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ.. ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం సఫలమైందని సీఎం అన్నారు.

తన సొంత నియోజకవర్గం మాదిరిగా రాష్టంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. 2014 లో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని కిరణ్ చెప్పారు. కాగా, తమ గొప్పలు తామే చెప్పుకోవాలన్నట్లుగా..కిరణ్ రెచ్చిపోయి మరీ.. గొప్పలు వల్లించినట్లుగా రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు.