పవన్ కళ్యాణ్ ను దేవుడిగా కొలిచే భక్తులలో గణేష్ ముందుంటాడు. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఓ మాట చెడుగా అంటే చాలు గణేష్ అసలు ఊరుకోడు. అవతలి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తయినా సరే దీటుగా సమాధానం చెపుతుంటాడు. అందుకే బండ్ల గణేష్ అంటే అభిమానులకు అంత ఇష్టం. అభిమానుల మనసులో పవన్ ఫై ఎంత అభిమానం ఉందో..గణేష్ దానిని పబ్లిక్ గా వ్యక్త పరుస్తుంటాడు. ఇక పవన్ సినిమా ఫంక్షన్ లలో గణేష్ స్పీచ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి యూట్యూబ్ లో ఆయన స్పీచ్ లు అదరగొడుతూనే ఉంటాయి. అలాంటి గణేష్ ఈరోజు ఇప్పటం లో జరగబోయే జనసేన ఆవిర్భావ సభ కు హాజరుకాబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు.
దేవర జెండాకి కర్రనౌతా..
దేవర రథ చక్రానికి కీలునౌతా అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
‘‘వీరులారా ధీరులారా, జనసేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి నేను కూడా వస్తున్నాను.
మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగువాని వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం.. కలిసి పోరాడదాం.
‘‘రాయలసీమ రాళ్లల్లో నిప్పు కణం.. కోస్తా మాగాణి పచ్చదనం…ఉత్తరాంధ్ర ఉప్పుటేరు వెచ్చదనం. నా దేవర స్వస్థలం’
ఇచ్ఛాపురం నుంచి హిందూపురం దాకా..తడ నుంచి బెజవాడ దాకాజనసేన జెండా రెపరెపలాడాలి..జనసేనాని జపం మారుమ్రోగాలి’’
అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.