పెళ్లి చేసుకొన్నా మాన‌ద‌ట‌!

Trisha-in-sariత్రిష త్వర‌లో పెళ్లి కూతురు కాబోతోంది. జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొద‌లుపెట్టబోతోంది. ఇంట్లో త్రిష‌కు త‌గిన సంబంధాలు వెద‌క‌డం ప్రారంభించార‌ట‌. అయితే… పెళ్లయిన త‌ర‌వాత కూడా…. సినిమాల్లో న‌టిస్తుంద‌ట‌. అందుకు అంగీక‌రించిన మ‌గాడినే భ‌ర్తగా చేసుకొంటాన‌ని ష‌ర‌తు విధిస్తోంద‌ట. అన్నిటికీ త‌ల ఊపితేనే పెళ్లిచేసుకొంటా.. అంటోంది. ఇంట్లో కూడా త్రిష పెళ్లి ప్రయ‌త్నాలు ముమ్మరం చేశారు. సినిమాలంటే విముఖ‌త భావం లేని అబ్బాయి కోసం అన్వేషిస్తున్నార‌ట‌. ”ప‌దేళ్లుగా సినిమాల‌తోనే మ‌మేకం అయిపోయా. ఇప్పుడు ఎవ‌రి కోస‌మే సినిమాల్ని దూరం చేసుకోలేను క‌దా? వ‌చ్చే వాడు అర్థం చేసుకొంటే అదే ప‌ది వేలు” అని చెబుతోంది. మ‌రి త్రిష కోరిక తీరుతుందో లేదో?