మార్చి 14 న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏపీ పోలీసులు అనుమతులు ఇచ్చారు. నిన్నటి వరకు అనుమతి నిరాకరించడం తో..జనసేన నేతలు హైకోర్టు కు వెళ్లాలని అనుకున్నారు. కానీ హైకోర్టు కు వెళ్తే ప్రభుత్వం ఫై మరింత వ్యతిరేకత వస్తుందని గ్రహించిన సర్కార్ ..సభ కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఈనెల 14వ తేదీన తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగబోతుండగా.. 14వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు సభకు అనుమతి ఇచ్చారు పోలీసులు. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశాయి పవన్. ఈరోజు ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల భేటీ అయ్యారు.. సభకు వచ్చే వారి రవాణా, పార్కింగ్ ఏర్పాట్ల పైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు.. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.