పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. మత్య్సకారులు కోసం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో ఏర్పటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్య లో అభిమానులు చేరుకున్నారు.
ర్యాలీలో కారుపై నిలుచుని అభివాదం చేస్తున్న సమయంలో ఓ అభిమాని ఒక్కసారిగా కారుపైకి దూసుకొచ్చారు. ఈ సమయంలో అభిమాని పవన్ ను నెట్టడంతో కారుపైనే కూర్చుండి పోయారు. దీంతో ప్రమాదం తప్పింది. దీంతో రోడ్ షోలో ఒక్కసారిలో కలకలం రేగింది. అయితే, కింద పడ్డ పవన్ కళ్యాణ్ నవ్వుతూ పైకి లేచి, తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. ఈ ఘటన తో అంత షాక్ అయ్యారు.