కరోనా కారణంగా ఏపీ రాష్ట్ర సర్కార్ రాత్రి కర్ఫ్యూ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు తో ప్రభుత్వం తెలిపిన కర్ఫ్యూ ముగుస్తుండడం తో ప్రభుత్వం మళ్లీ రాత్రి కర్ఫ్యూ ను పొడగిస్తుందో..లేదా తగ్గిస్తుందో అని అంత ఎదురుచూస్తున్న క్రమంలో రాత్రి కర్ఫ్యూ ను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ తెలిపింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అయితే కరోనా నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఫీవర్ సర్వేను కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏజన్సీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు.