వసంత పంచమి వేడుకలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కు ఘనసత్కారం

వాగ్దేవీ వైభవంగా ఈ సమస్త సృష్టీ పరవశించే అద్భుత పర్వదినం వసంత పంచమి మాత్రమేనని శృంగేరీ పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి ఆదేశానుసారం హైదరాబాద్ శృంగేరీ మహాసరస్వతీ దేవాలయంలో అత్యద్భుతంగా జరిగిన వసంతపంచమీ వేడుకల్లో ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ప్రత్యేక అతిధిగా పాల్గొని శృంగేరీ శారదాంబ అనుగ్రహం పొందారు.

శృంగేరీ సంప్రదాయానుసారం శనివారం ఉదయం మంత్రశాస్త్ర మర్యాదల మధ్య జరిగిన అక్షరాభ్యాస వేడుకల్లో సుమారు ఎనిమిది వందలమంది విద్యార్థులు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాలలో వందలకొలది ఆలయాల్లో అజరామర ఖ్యాతి పొందిన పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాల వైభవం తెలియంది కాదు.

అనేక పీఠాల్లో, మఠాల్లో సైతం ప్రామాణికంగా కీర్తించే పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలు ఈసారి శ్రీపంచమి వేడుకల్లో సైతం బాసర మహాక్షేత్రం మొదలు, యాదాద్రి వరకు పవిత్రంగా సందడి చేశాయి. వేలకొలది భక్తగణాన్ని పరవశింపచేశాయి.

ఏదెలావున్నా … ఈసారి వసంతపంచమి వేడుకలో పురాణపండ శ్రీనివాస్ పాల్గొనడం తమకు విశేషంగా ఆనందం కలిగించిందని ఆలయవర్గాలు, ధర్మాధికారి కె.జె.మూర్తి చెప్పడం విశేషం.