భార్య భర్తల విడాకులకు ట్రాఫిక్ కూడా ఒక కారణం అట. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సమాజంలో మూడు శాతం విడాకులకు ట్రాఫిక్ కారణమని చెబుతోంది. సామాన్య మహిళగానే తానీ విషయాన్ని చెబుతున్నానని.. మాజీ సీఎం భార్యగానో, బీజేపీ నాయకురాలిగానో చెప్పడం లేదని అంటోంది. రోడ్లలో గుంటలు, ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇంటికి చేరుకోలేకపోవడానికి కారణం. దీనివలన చాలామంది కుటుంబంతో గడపలేక పోతున్నారని అందువలనే విడాకుల శాతంలో మూడు శాతం ట్రాఫిక్ కారణాలతో విడిపోతున్నారని చెప్పింది. ముంబైలో తాను ఇటువంటి పరిస్థితిని గమనించానని కూడా చెప్పింది.