మంగళవారం నాడు 2022-23 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఈ బడ్జెట్లో వేటికి ధరలు పెరుగుతున్నాయి..వేటికి ధరలు తగ్గుతున్నాయనేది చూస్తే..
ధరలు పెరిగే వస్తువుల జాబితా:
- ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, విదేశీ గొడుగులు, క్రిప్టో లావాదేవీలు పెరగనున్నాయి.
ధరలు తగ్గేవి..
- వస్త్రాలు
- నగలు
- మొబైల్ ఫోన్స్
- మొబైల్ ఛార్జర్
- చెప్పులు
- స్టీల్ స్క్రాప్స్
ఈ బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఐటీఆర్‌లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి మరింత గడువు ఇచ్చింది. రెండేళ్ల గడువు ఇస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.