తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారినపడ్డారు. నిన్న సోమవారం ఆయన తనయుడు నారా లోకేష్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈరోజు చంద్రబాబు నాయుడు కు కరోనా సోకడంతో తెలుగుదేశం శ్రేణుల్లో , కార్య కర్తల్లో ఆందోళన పెరిగింది. చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా తనకు కరోనా సోకినా విషయాన్నీ తెలిపారు.
ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు .. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు తో పాటు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం ఐసోలేషన్లో ఉన్నట్లు దేవినేని ఉమా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.