మద్యం మత్తులో కొంతమంది ఏంచేస్తారో వారికే అర్ధం కాదు..తాజాగా సంక్రాంతి పండగవేళ చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తగిన మైకంలో పొట్టేలుకు బదులు మనిషి ని నరికాడు. ఈ ఘటన మదనపల్లె లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
ప్రతి ఏటా మదనపల్లెలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం వద్ద పశువల పండుగా జరుపుతుంటారు. పశువుల పండుగలో భాగంగా ఎల్లమ్మ దేవతకు పొట్టేలును బలి ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే చేయాలనీ గ్రామస్థులు భావించారు. అందుకు గాను అన్ని సిద్ధం చేసారు. పొట్టేలును బలి ఇచ్చే ముందు అక్కడ ఉన్న వారంతా.. ఫుల్ గా మద్యం సేవించారు. కాగ టీ. సురేష్ అనే వ్యక్తి పొట్టేలును పట్టుకున్నాడు. దీంతో మరో వ్యక్తి మద్యం మైకంలో పొట్టేలు నరకబోయాడు. కానీ ప్రమాదవశాత్తు కత్తి వేటు పొట్టేలు పై కాకుండా దానిని పట్టుకున్న టి. సురేష్ పైన పడింది. దీంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు బుక్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.