సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ సందడంతా ఏపీలోని కనిపిస్తుంది. దేశంలో ఎక్కడ ఉన్న సరే సంక్రాంతి కి సొంత ఊర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటారు. ఇక కోడి పందాలు , ఎడ్ల పందాలు ఇలా ఒకటేంటి ఎన్నో రకాల పందాలు సంక్రాంతి వేళా వేస్తుంటారు. ఇక ఈసారి సంక్రాంతి సంబరాల్లో పందుల పందాలు జరిపి వార్తల్లో నిలిచారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు ప్రాంతం ఈ పందుల పోటీలకు వేదికైంది.. స్థానికంగా ఉండే గిరిజనులు పందుల పోటీలను నిర్వహించగా.. ఇక, ఈ పోటీలను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.