రాజ్యసభ సీటుపై చిరంజీవి క్లారిటీ

గత కొద్దీ రోజులుగా ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ విషయంపై చర్చించడానికి సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఈ భేటీపై ఇప్పుడు రాజకీయ దూమారం లేచింది, దీనిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు.ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను.