మిసెస్‌ ఇండియా- 2021 పోటీలో విజయవాడ అమ్మాయి విజేత

మిసెస్‌ ఇండియా- 2021విజయవాడ అమ్మాయి బిల్లుపాటి మల్లిక విజేతగా నిలిచి వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పేజెంట్స్‌ ప్రైవేట్‌ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం నాలుగు రోజులు పాటు మిసెస్‌ ఇండియా- 9వ సీజన్‌ పోటీలు జరిగాయి.

దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. వివిధ రౌండ్ల అనంతరం12 మంది టైటిల్‌ బరిలో నిలిచారు. తాజాగా జరిగిన తుది విడత పోటీల్లో వారందరినీ వెనక్కు నెట్టి మిసెస్‌ ఇండియా కిరీటం కైవసం చేసుకున్నారు మల్లిక.