భారత టాప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమ్ఇండియా తరఫున 1998లో అరంగేట్రం చేసిన భజ్జీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ను 2016లో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో చోటు లభించలేదు. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ట్విటర్ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. దాదాపు 23 ఏళ్ల కెరీర్లో హర్భజన్ సింగ్ 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 3,500కుపైగా పరుగులు సాధించాడు. అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన వారిలో హర్భజన్ (417) నాలుగో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో 269 వికెట్లు, టీ20ల్లో 25 వికెట్లు తీశాడు.