తమిళనాడులో ఇద్దరమ్మాయిలు ఒకరికి తెలియకుండా ఒకరు మరొకడితో సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ఇద్దరూ కలసి కిరాయి హంతకులతో వాడిని చంపించేశారు. ఇంతకీ ఆ అమ్మాయిల వయసు 15 ఏళ్లు. ఇద్దరూ టెన్త్ క్లాస్ చదువుతున్నారు. చెన్నైకి సమీపంలోని చెంగల్పట్టులో ఇద్దరమ్మాయిలు.. ప్రేమ్ కమార్ అనే 21ఏళ్ల కాలేజీ స్టూడెంట్ తో ప్రేమలో పడ్డారు. అమ్మాయిలిద్దరూ ఫ్రెండ్స్. ప్రేమ్ కుమార్ ఒకరికి తెలియకండా ఒకరితో శృంగారం నడిపాడు. అమ్మాయిల నగ్న ఫొటోలను, శృంగారం చేస్తున్న వీడియోలను తీసి వారిద్దర్నీ బ్లాక్ మెయిల్ చేయడం మొదల పెట్టాడు. ఆ విధంగా ఇద్దరి వద్దనుంచి దాదాపు లక్ష రూపాయలు దండుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరికీ తమకు ప్రేమ్ కుమార్ తో సంబంధం ఉందని తెలిసింది. దీంతో అమ్మాయిలిద్దరూ మాట్లాడుకుని సోషల్ మీడియాలో అశోక్ అనే మరో అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశారు.
ఆ తర్వాత అశోక్ కు తమను బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రేమ్ కుమార్ గురించి చెప్పి, ఆ పీడ వదిలించమని కోరారు. దీంతో అశోక్ తన ముగ్గురు స్నేహితులతో కలసి ప్లాన్ చేసి అమ్మాయిలచేత ప్రేమ్ కుమార్ ను షోలవరం టోల్ ప్లాజా దగ్గరకు రప్పించాడు. అక్కడినుంచి అశోక్, అతని స్నేహితులు ప్రేమ్ కుమార్ ను కిడ్నాప్ చేసి ఈచంగాడు అనే గ్రామం వద్దకు తీసుకెళ్లి అక్కడ చంపేసి పూడ్చేశారు. అయితే గ్రామంలో ఒక ప్రాంతంలో రక్తంతో కలసిన జుట్టు, ఊడిపోయిన పళ్లు, రక్తపు మరకలు.. ఇవన్నీ ఉండటంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ప్రేమ్ కుమార్ ఆచూకీ తెలిసి అతడి సెల్ ఫోన్ కాల్ లిస్ట్ పరిశీలించగా అమ్మాయిలు చివరిగా మాట్లాడారని తేలింది. అమ్మాయిలిద్దర్నీ అదుపులోకి తీసుకోగా, చేసిన దారుణాన్ని ఒప్పుకున్నారు. హత్య చేయించింది మైనర్ బాలికలు కావడంతో వారిని బాలికా అరెస్ట్ చేసి బాలనేరస్థుల జైలుకి తరలించారు.