యువతుల కనీస పెళ్లి వయసు 21ఏళ్లకు పెంపు, లోక్‌సభ లో బిల్లు !

దేశంలో యువతుల కనీస పెళ్లి వయసును 18ఏళ్ల నుంచి 21ఏళ్లకు పెంచే దిశగా బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు – 2021ని కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ వారి ఆందోళనల నడుమే కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే విపక్షాలు అభ్యంతరాలు చెప్పడంతో స్టాండింగ్ కమిటీ కి పంపిస్తున్నట్లు తెలిపారు.