సుజనా చౌదరి ఆవేదన

sujana chowdary డిల్లీ లో శుక్రవారంనాడు జరిగిన అమానుష దాడి పట్ల రాజ్యసభ సభ్యులు వై.ఎస్ . చౌదరి తీవ్ర
 ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ సంఘటనను దేశం ఇంకా మరచిపోక ముందే మళ్లీ ఇలాంటి
 సంఘటన పునరావృతం కావటం పట్ల ఆయన కలత చెందారు. నిరసనకారులపై పోలీసులు
 ప్రవర్తించిన తీరును ఆయన గర్హించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు
 తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను ఆయన
 ధృతరాష్ట్ర పాలనగా అభివర్ణించారు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న అత్యాచార సంస్కృతికీ,
 పైశాచిక ప్రవృత్తికీ అడ్డుకట్ట వేసేందుకు అన్ని రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన
 పిలుపునిచ్చారు.