ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. 900 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇండోనేషియా డిజాస్టర్‌ మైటిగేషన్‌ ఏజెన్సీ (BNPB) అధికారి తెలిపారు.

జావా ద్వీపంలోని అతి ఎత్తయిన (3600 మీటర్లు) సెమెరు అగ్నిపర్వతం నుంచి శనివారం నుంచే పెద్ద ఎత్తున బూడిద, తీవ్రమైన వేడి వెలువడటం మొదలైంది. 40 వేల అడుగుల ఎత్తువరకు దట్టంగా పొగ, దుమ్ముధూళి అలుముకుంది. దీంతో భయాందోళనకు గురైన తూర్పు జావా ప్రాంతంలోని చాలా మందిని BNPB బృందాలు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు