వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో 686 కోట్లు వేసిన సీఎం జగన్

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న విద్యాదీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.ఈ ఏడాది మూడో విడతగా రాష్ట్రంలోని దాదాపు 11.03లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్ల నిధులను తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. విద్యార్థులు ఏ విషయంలోనూ ఇబ్బందులు పడకూడదని.. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు.