ఒమిక్రాన్‌ లక్షణాలు ఎలా ఉంటాయంటే …

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గిందని అనుకునే లోపే మరో కొత్త వేరియంట్ బయటకొచ్చింది. ఒమిక్రాన్‌ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఒమిక్రాన్‌తో ఎంతమేరకు రిస్క్ ఉందనే విషయం పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఒమిక్రాన్‌ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

ఒమిక్రాన్‌ వైరస్ ఉన్నవారిలో తీవ్రమైన అలసట ఉంటుంది. యువకులు కూడా బాగా అలసి పోవడం లాంటి లక్షణాలు మనం చూడొచ్చు. అలానే ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవెల్స్ ఇందులో డ్రాప్ అవ్వట్లేదు. మనం కరోనా సెకండ్ వేవ్ లో ఉన్నప్పుడు చాలా మందిలో ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయ్యాయి. కానీ ఈ వేరియంట్ లో అలా ఉండదు. ఒమిక్రాన్‌ వైరస్ బారిన పడిన వారిలో రుచి తెలియటం కానీ వాసన కానీ తెలియకపోవడం ఉంటుంది. అలానే ఈ వైరస్ బారిన పడ్డ వాళ్లలో చాలా మంది ఆస్పత్రిలో చేరకుండానే కోలుకోవచ్చని డాక్టర్స్ చెపుతున్నారు.

ఇక గత రెండేళ్లలో వైరస్ పట్ల మన దేశంలో చాలావరకు అవగాహన వచ్చింది. ఇక కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అంటే మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపరుచుకోవడం, వ్యాక్సినేషన్ చేయించుకోవడం, జనసమర్దత ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం, భౌతిక దూరం పాటించడం, వెంటిలేషన్ ఉండే గదుల్లో ఉండటం వంటివి పాటించాలని వైద్యులు చెబుతున్నారు. అయితే రోజువారీ కేసుల సంఖ్య భారత్‌లో తగ్గుతోంది. అదే సమయంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు భారత్‌లో గుర్తించలేదు.