17 ఏళ్ళ కూతురు, తన బాయ్ ఫ్రెండ్ , మరో ముగ్గురు స్నేహితులతో తండ్రిని దారుణంగా చంపించింది. బెంగుళూరు ఎలహంకలో ఈ ఘోరం చోటుచేసుకుంది. అరుణ్ వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు ఇంటర్మీడియట్ చదువుతొంది. చిన్న కూతురు 8 వ తరగతి చదువుతుంది. తల్లి ఇంట్లోలేని సమయంలో అర్ధరాత్రి , నలుగురు యువకులు ఇంట్లోకి వచ్చి , సుత్తితో అరుణ్ తలపై కొట్టి , తర్వాత గొంతుకోసి చంపేశారు. పక్కింటి వాళ్ళిచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
విచారణలో తండ్రిని తన స్నేహితులే చంపేశారని పెద్ద కూతురు చెప్పింది. తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని , అందుకే తన ఫ్రెండ్స్ కి చెప్పి చంపమన్నానని తెలిపింది. తల్లికూడా , కూతురు వాదననే సమర్ధించింది. అయితే కూతురు చెప్పిన దాంట్లో నిజమెంతో దర్యాప్తుచేస్తున్నామని పోలీసులు తెలిపారు. కూతురు , బాయ్ ఫ్రెండ్స్ వ్యవహారం తెలిసి , తండ్రి మందలిస్తే , చంపించిందేమో అన్న అనుమానం కూడా ఉంది.. పెద్ద కూతురిని , నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ని , పోలీసులు బాల నేరస్తుల కోర్టుకి పంపారు.