ఏపీలో భారీ వర్షాల కి చాలా ఆస్థి నష్టం జరగడంతో కేంద్రంనుండి సాయంకోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఏపీలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎంటీసీ బృందాలను రాష్ట్రానికి పంపాలని కోరారు. భారీవర్షాల వల్ల 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం లేఖలో పేర్కొన్నారు.