ఎన్టీఆర్ సినిమా ‘రామ‌య్య వ‌స్తావ‌య్యా’

ramayyaమాస్ టైటిల్ కోసం ఇన్నాళ్లూ ఎదురు చూసిన హ‌రీష్‌శంక‌ర్ ఈసారి క్లాస్‌ కే ఫిక్సయ్యాడు. ఎన్టీఆర్ సినిమాకి ‘రామ‌య్యా వ‌స్తావయ్యా’  పేరు డిసైడ్ చేశారు. ఎన్టీఆర్‌, స‌మంత జంట‌గా ఓ సినిమా తెర‌కెక్కుతోంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత‌. ఈ చిత్రానికి ‘రామయ్యా వ‌స్తావ‌య్యా’ పేరు ఖ‌రారు చేశారు. వినోదం, యాక్షన్ మేళ‌వించిన క‌థ ఇది. మాస్‌ ని మెప్పించ‌డం కోసం మాంఛి మాస్ టైటిల్ కోసం అన్వేష‌ణ జ‌రిగింది. అయితే ఎన్టీఆర్‌… ‘రామ‌య్యా వ‌స్తావయ్యా’కే ఓటేశారు.