మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్ : అరబిక్కడలిండే సింహం’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కేరళ నేవీ ఆఫీసర్ కుంజాలీ మరక్కార్ 4 జీవిత కథ ఆధారంగా రూపొందింది. సూపర్ హిట్ హాలీవుడ్ చిత్రం ‘పైరైట్స్ ఆఫ్ కరేబియన్’ చిత్రం తరహాలో గ్రాఫిక్స్ మాయాజాలంతో విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.
ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా సార్లు విడుదలను వాయిదా వేసుకుంది. ఆ టైమ్ లో పలు ఓటీటీల నుంచి ఈ సినిమాకి భారీ ఆఫర్స్ వచ్చాయి. అయినా సరే ఇంతటి భారీ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేస్తే బాగుంటుందని అప్పుడు నిర్మాతలు భావించారు. మరోసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ కేరళలోని థియేటర్స్ మూతపడే పరిస్థితులేర్పడడం, అలాగే.. థర్డ్ వేవ్ ముప్పుకూడా భయపెడుతుండడంతో ఇప్పుడు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి ఓటీటీ తో ప్రోఫిటబుల్ డీల్ కుదిరిందట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా.. మోహన్ లాల్ టీనేజ్ పాత్రను ఆయన తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ చేస్తుండగా.. కీర్తి సురేశ్ చిన్నప్పటి పాత్రను ప్రియదర్శన్ తనయ కళ్యాణి ప్రియదర్శన్ చేస్తుండడం విశేషం.