రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మండిపోతుండంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా బుధవారం ధరలను మరోసారి పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు లీటరు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి.
తాజాగా పెరిగిన ధరలతో..
న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.107.94, డీజిల్ ధర రూ.96.67
ముంబైలో పెట్రోల్ రూ.113.80, డీజిల్ రూ.104.75
చెన్నైలో పెట్రోల్ రూ.104.83 , డీజిల్ రూ.100.92
కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.46, డీజిల్ రూ.99.78
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు పెరగగా.. డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.112.27 కి చేరగా.. డీజిల్ ధర రూ.105.46కి పెరిగింది.