రానున్న పండుగ రోజుల్లో వంటనూనెల ధరలు పెరగకుండా ఉండేందుకు నూనె గింజలు, వంటనూనె లు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు వీటి నిల్వలపై పరిమితులు విధించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆహారమంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. వారం రోజుల్లోగా గరిష్ఠ నిల్వలపై పరిమితులు విధించాలని కోరింది. రిఫైనరీలు, మిల్లర్లు, హోల్ సెల్ డీలర్ల వద్ద రెండు నెలల నిల్వ సామర్థ్యం కంటె అధికంగా నిల్వ చేయకుండా రాష్ట్రాలు పరిమితులు విధించాలని కోరింది.