గద్వాల్ గొడవ !

jupalli-dk-arunaఒకరేమో జిల్లా రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్న మంత్రిగారు.. మరొకరేమో.. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గులాబి నేత. రాజకీయాల్లో ఇదరూ.. ఇద్దరే !. వీరిద్దరు ఎప్పుడు ఢీకొన్నా.. మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు వేడెక్కాల్సిందే. వారేవరో ఇప్పటికే అర్థమయి ఉంటుంది. ఒకరేమో మంత్రి డికె. అరుణ, మరోకరేమో.. గులాబి నేత జూపల్లి కృష్ణారావు. తాజాగా మంత్రి డికె. అరుణ మహబూబ్ నగర్ జిల్లా బస్సు యాత్ర సందర్భంగా వీరి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి.

అరుణ బస్సు యాత్ర సందర్భంగా తెలంగాణ వాదులు రెచ్చిపోయి బస్సుపై కోడిగుడ్ల, చెప్పుల వర్షం కురిపించారు. దీంతో.. ఉద్వేగానికి లోనైనా మంత్రిగారు.. దమ్ముంటే ముందుకొచ్చి ఎదురుపడాలని, లేకుంటే గాజులు తొడుక్కుని, చీర కట్టుకుని ఇంట్లో కూర్చోవాలని జూపల్లిని ఉద్దేశించి తీవ్రంగా వివర్శించారు. మంత్రి వ్యాఖ్యలపై జూపల్లి ఘూటుగా స్పందించారు. వాటిని నీ భర్తకివ్వాలంటూ.. మండిపడ్డారు. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని మంత్రి అరుణకి జూపల్లి సవాల్ విసిరారు. ఒక్క ఓటుతో గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. మంత్రి అరుణ ఓ కలియుగ తాటకంటూ జూపల్లి విరుచుకుపడ్డారు. దీంతో గద్వాల్ గొడవ.. కాస్త తెలంగాణ రంగు పులుముకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.