ఒకే చెట్టుకు 40 రకాలు పండ్లు, మీరెప్పుడైనా చూసారా ?

ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలు పండ్లు పండాయి. పెన్సిల్వేనియా ఎక్స్ పరిమెంట్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఓ వ్యక్తి ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు కాయించడం వండర్‌లా మారింది. రీడింగ్‌ సిటీకి చెందిన సామ్ వాన్ అకెన్ ఈ రకమైన ప్రయోగాలు చేశాడు. జన్యుపరంగా ఒకేరకమైన మొక్కలను అంటుకట్టడం ద్వారా ఇది సాధ్యమైందని, అలాగే విత్తనాలు ఉండే పండ్ల మొక్కలను జన్యుపరంగా అంటుకట్టడంతో ఇలాంటి చెట్టును సృష్టించినట్టు అకెన్ చెప్పారు. వాణిజ్యపరంగా తక్కువ లాభదాయకమైన అనేక పండ్ల జాతులు కనుమరుగవుతున్నాయనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగం చేశానని చెప్తున్నాడు.