ఇండియాలో తిరిగే విమానాలలో హై స్పీడ్ ఇంటర్నెట్

మన దేశ గగనతలంపై దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సన్నద్ధమైంది.

ఇందుకు అవసరమైన లైసెన్సులను టెలికాం విభాగం (డాట్‌) నుంచి పొందింది. భారత్‌లో గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌(జీఎక్స్‌) మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడానికి తమ వ్యూహాత్మక భాగస్వామి బీఎస్‌ఎన్‌ఎల్‌కు లైసెన్సులు దక్కాయని బ్రిటిష్‌ శాటిలైట్‌ సంస్థ ఇన్‌మర్సాట్‌ బుధవారం తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పొందిన ఇన్‌ఫ్లైట్‌, మారిటైమ్‌ కనెక్టివిటీ(ఐఎఫ్‌ఎమ్‌సీ) లైసెన్సులతో ప్రభుత్వం, విమానయాన, నౌకాయనానికి చెందిన భారత వినియోగదార్లకు జీఎక్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని ఇన్‌మర్సాట్‌ వివరించింది.