ఢిల్లీ నుంచి తిరుపతికి తొలిసారిగా స్పైస్ జెట్ సంస్థ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయమంత్రులు జనరల్ వీకేసింగ్, ప్రహ్లాద్‌పటేల్, స్పైస్ జెట్ సీఎండీ అజయ్‌సింగ్‌లతో కలిసి ఈ విమానసేవలను ప్రారంభించారు.
తొలుత బుధ, శుక్ర, ఆదివారాల్లో విమాన సర్వీసులు నడుస్తాయని, ఈ నెల 31వ తేదీ నుంచి వారంలో నాలుగురోజుల పాటు సేవలు కొనసాగుతాయని ప్రకటించారు. తిరుపతి విమానాశ్రయం ప్రారంభమై 50 సంవత్సరాలైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2022 మే నాటికి రన్‌వే విస్తరణ పనులు పూర్తిచేసి వైడ్ బాడీ అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామని జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు.