దిల్‌సుఖ్‌నగర్‌ లో వర్ష భీబత్సo, కూలిన థియేటర్‌ ప్రాహరి గోడ

నిన్న రాత్రి హైద్రాబాద్ లో కురిసిన భారీ వర్షానికి దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతం అతలాకుతులమైంది. ఆ ప్రాంతంలోని ప్రముఖ థియేటర్‌ శివ గంగను వరద పోటెత్తింది. భారీ వర్షానికి థియేటర్‌ ప్రహరీ కూలింది. దీంతో అక్కడే పార్కు చేసిన సుమారు 50 ద్విచక్రవాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఫస్ట్‌ షో సినిమా చూసి బయటకి వచ్చేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం ప్రేక్షకులు భారీ వర్షంలో ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు థియేటర్లోకి వర్షపు నీరు భారీగా చేరడంతో హాల్‌లోని కుర్చీలు నీట మునిగాయి. ఇక జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఉదయం థియేటర్‌ను పరిశీలించారు. జరిగిన నష్టం గురించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. జేసీబీతో గోడ శిథిలాలను తొలగించి వాహనాలను బయటకి తీశారు.