భారత వైమానిక దళం 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొంటోంది. గడిచిన 8 దశాబ్దాల్లో వాయుసేన సాంకేతికంగా అభివృద్ధి చెందడంతో పాటు, గగనమార్గంలో దేశానికి ముప్పులేకుండా రక్షిస్తోంది. రక్షణ,యుద్ధాల్లోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ వాయుసేన కీలక పాత్ర పోషిస్తోంది.
వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘజియాబాద్ హిండన్ ఎయిర్‌స్టేషన్ లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, నావికా దళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవణే హాజరయ్యారు. ఎయిర్ ఫోర్స్ డేను పురస్కరించుకుని వైమానిక దళం నుంచి వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి గౌరవ వందనం స్వీకరించారు. వైమానిక సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.