ఐఎంపీఎస్‌ లావాదేవీల పరిమితి పెంచిన ఆర్‌బీఐ

డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్‌ లావాదేవీల పరిమితిని పెంచింది. ప్రస్తుతం ఐఎంపీస్‌ ద్వారా గరిష్ఠంగా రూ.2లక్షల వరకు బదిలీ చేసే వీలుండగా తాజాగా దాన్ని రూ.5లక్షలకు పెంచింది.
ఈ మేరకు ఆర్‌బీఐ గరవ్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు.