సంచలన మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ సాంగ్‌ను రూపొందించారు. ఈ వీడియో సాంగ్‌ను గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, తెలంగాణ జాగృతి నాయకురాలు కల్లకుంట్ల కవిత నిర్మించారు. ఈ సాంగ్ ను కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేయగా..ఈ పాట విన్న చాలామంది సాంగ్ ఫై విమర్శలు కురిపిస్తున్నారు.
గతంలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ సాగే పాట.. సింగర్ మంగ్లీ పాట మరో పాట .. వంటి బతుకమ్మ పాటలను విన్నప్పుడు ఆ పాటల్లో పండుగలోని ఉత్సాహాన్ని తెలియజేసేలా ఓ జోష్ కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు గౌతమ్ మీనన్, ఎ.ఆర్.రెహమాన్ కంపోజ్ చేసిన ఈ ‘అల్లిపూల వెన్నెల చెరువులోన కురవగా.. ’ అనే బతుకమ్మ సాంగ్‌లో ఆ జోష్ కనిపించలేదు.
‘ఇదొక పాటనా..! బతుకమ్మ పాట ఇలా ఉంటుందాండి. ఆ జోష్.. బీట్ ఎక్కడ, ఆస్కార్ అవార్డ్ అందుకున్నవాళ్లు ఇలాంటి సంగీతాన్ని అందింవచ్చా’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘ఏం సాంగ్ రా నాయనా..బతుకమ్మ పండగ మీదే విరక్తి వచ్చేలా ఉంది. ఈ మాత్రం దానికి ఎ.ఆర్.రెహమాన్, గౌతమ్ మీనన్ అవసరమా’ అని మరొకరు కామెంట్స్ కురిపిస్తున్నారు.