కోవిడ్ పరిస్థితులు చాలా వరకు మెరుగవడంతో పాస్ పోర్టుల జారీకి వంద శాతం అపాయింట్ మెంట్లు ఇవ్వాలని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని పాస్ పోర్టు సేవా కేంద్రాలు, పాస్ పోర్టు లఘు కేంద్రాలు, 14 తపాలా సేవా కేంద్రాల్లో వంద శాతం అపాయింట్ మెంట్లు ఇచ్చే విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రాంతీయ పాస్ పోర్టు కేంద్రం అధికారి తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తుందని ఆయన చెప్పారు.