తెలంగాణ లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచేందుకు, రాష్ట్ర విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పాఠశాలలో పాటించవలసిన కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసినవిద్యా శాఖ క్లాసుల ప్రత్యక్ష నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో స్కూళ్ల సన్నద్ధతపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. డీఈవోలు, విద్యాశాఖ అధికారులతో వర్చువల్గా సమావేశం కానున్నారు. జిల్లాలవారీగా ఏర్పాట్లపై మంత్రి ఆరా తీయనున్నారు