పవన్.. ‘అత్తారింటికి దారేది’!

Pawan-kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అయితే మీడియాలో మాత్రం ఈ చిత్రానికి సరదా, హరే రామ హరే అనే టైటిల్స్ ప్రచారం బాగానే జరిగింది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు మరో టైటిల్ వినిపిస్తుంది. అదే ‘అత్తారింటికి దారేది’. అచ్చ తెలుగు టైటిల్ లా అనిపిస్తుంది కదా? అవును దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ చిత్రాన్ని కుటుంబ కధా నేపధ్యంలో తెరకేక్కిస్తున్నాడు. కధ ప్రకారం ఈ చిత్రానికి ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ యాప్ట్ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకూ టైటిల్ విషయమై అథికారికంగా ఏ ప్రకటనా రాలేదు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఓ కీలక పాత్ర కనిపిస్తుండగా, మిర్చి’ చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా సమంత తల్లి గా కనిపిస్తుంది.